For Money

Business News

17,800పైన ముగిసిన నిఫ్టి

మార్కెట్‌ విశ్లేషకుల అంచనాల మేరకు నిఫ్టి 18000 పరుగులు తీసే సూచనలు కన్పిస్తున్నాయి. పడిన ప్రతిసారీ నిఫ్టికి మద్దతు లభిస్తోంది. విదేశీ ఇన్వెస్టర్ల కాల్, ఆప్షన్స్‌ డేటా ఇదే చెబుతోంది. ఇవాళ నిఫ్టి ఆకర్షణీయ లాభాలు గడించినా మిడ్‌సెషన్‌లో నష్టాల్లోకి చేరుకుంది. గరిష్ఠస్థాయితో పోలిస్తే 200 పాయింట్లు పడిన నిఫ్టి తరవాత వంద పాయింట్లు కోలుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే 67 పాయింట్ల లాభంతో 17812 వద్ద నిఫ్టి ముగిసింది. నిఫ్టికి బ్యాంక్‌ నిఫ్టి నుంచి మద్దతు లభించింది. ఎన్‌బీఎఫ్‌సీల సూచీ నామ మాత్రపు నష్టంతో ముగిసింది. మిడ్‌ క్యాప్‌ సూచీ అర శాతంపైగా లాభంతో క్లోజ్‌ కావడం విశేషం. క్రూడ్‌ ధరలు పెరగడంతో ఓఎన్‌జీసీ మళ్ళీ వెలుగులో ఉంది.చాలా రోజుల తరవాత గ్రాసిం నిఫ్టిలో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇక బజాజ్‌ ట్విన్స్‌ ఇవాళ నష్టాల్లో ముగిశాయి.