For Money

Business News

21-22లో జీడీపీ వృద్ధి రేటు 9.2%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశ జీడీపీ వృద్ధిరేటు 9.2 శాతం ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతంలో ఆర్బీఐ వేసిన అంచనా కంటే ఇది కాస్త తక్కువ. జీడీపికి సంబంధించిన ముందస్తు గణాంకాలను భారత గణాంకాలు, పథకాల అమలు శాఖ ఇవాళ వెల్లడించింది. ఆర్బీఐ అంచనా ప్రకారం వృద్ధి రేటు 9.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఈ వృద్ధి రేటు గత 17 ఏళ్ళలో అత్యధికం. అయితే బేస్‌ రేటు చాలా తక్కువగా ఉన్నందున ఈ వృద్ధిరేటు అధికంగా కన్పిస్తోంది. ఇంకోలా చెప్పాలంటే 100 ఆదాయం 20కి పడిపోయిన తరవాత కాని 20 నుంచి 45కి పెరిగినపుడు దాదాపు 125 శాతం పెరిగిందని అంటాం. అలా గత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 7.3 శాతం. అక్కడ నుంచి ఎంత పెరిగినా గొప్పగానే ఉంటుంది.