For Money

Business News

17500పైన ముగిసిన నిఫ్టి

రేపు వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు కారణంగా స్వల్ప లాభాల స్వీకరణ జరిగింది. ఒదకశలో 17600 స్థాయిని దాటిన నిఫ్టి… క్లోజింగ్‌కు ముందు 17472కు క్షీణించింది. చివర్లో స్వల్పంగా కోలుకుని 17512 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 25 పాయింట్ల లాభపడింది. యూరో మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభం కావడం, అమెరికా ఫ్యూచర్స్‌కూ చల్లబడటంతో… మన మార్కెట్‌లో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. అధిక స్థాయిలో కొనుగోలు చేయొద్దని, మార్కెట్‌ పడేంత వరకు ఆగమని అనలిస్టులు సలహా ఇవ్వడంతో నిఫ్టికి తాజా మద్దతు అందలేదు. నిఫ్టి ఫైనాన్షియల్స్‌ మినహా… మిగిలిన సూచీలు నామ మాత్రపు లాభాలతో ముగిశాయి. నిఫ్టి నెక్ట్స్‌ నష్టాల్లో ముగిసింది. నెస్లే, ఐటీసీ ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచాయి. హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా ఆకర్షణీయ లాభాలు గడించాయి. అదానీ ట్రాన్స్‌ మిషన్‌ ఇవాళ మూడు శాతం నష్టంతో ముగిసింది. డిజిన్వెస్ట్‌మెంట్‌ వార్తలతో కాంకర్డ్‌ షేర్‌ 7 శాతం లాభపడింది. గత కొన్ని రోజులుగా నాన్‌ స్టాప్‌గా పెరిగిన ఆస్ట్రాల్‌లో భారీ కరెక్షన్‌ వచ్చింది. షేర్‌ 5 శాతంపైగా క్షీణించింది.