For Money

Business News

17550 పైన నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఆరంభంలోనే 17585 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం 17555 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 66 పాయింట్ల లాభంతో ఉంది. చాలా రోజుల తరవాత హెచ్‌డీఎఫ్‌సీ ట్వీన్స్‌ గ్రీన్‌లోకి వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ మూడు శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.69 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఇవాళ కూడా నిఫ్టికి బ్యాంక్‌ నిఫ్టి నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. సాధారణంగా అధిక స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే పొజిషన్స్ ఉన్నవారు స్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌తో తమ పొజిషన్స్‌ కొనసాగించవచ్చు. కొత్తగా మాత్రం ప్రస్తుత స్థాయిలో కొనుగోలు చేయొద్దని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. నిఫ్టికి తొలి ప్రతిగటన 17564, రెండో ప్రతిఘటన 17588 వద్ద ఎదురు కానుంది. నిఫ్టిలో గట్టి ర్యాలీ రావాలి.. బ్రేకౌట్‌ రావాలి అంటే 17624ని నిఫ్టి దాటాలి. ఈ పరిస్థితి ఇవాళ రాకపోవచ్చు. నిఫ్టిని కొనాలని భావించే వారు లాభాల స్వీకరణ జరిగే వరకు ఆగాలి. షార్ట్‌ కవరింగ్‌ రాకవడం కష్టమే. కాబట్టి నిఫ్టి గనుక 17440 ప్రాంతానికి వస్తుందేమో చూడాలి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో ఇన్వెస్టర్లు యూరో మార్కెట్ల స్పందన కోసం ఎదురు చూడొచ్చు. ఈలోగా మార్కెట్‌లో ఒత్తిడి వస్తుందేమో చూడండి. ఎస్‌బీఐ, ఓఎన్‌జీజీ, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ వంటి షేర్లలో స్వల్ప లాభాల స్వీకరణ కన్పిస్తోంది. అదానీ ట్రాన్స్‌ ఇవాళ కూడా గ్రీన్‌లో ఉంది. పిడిలైట్‌లో లాభాల స్వీకరణ కారణంగా ఈ షేర్‌ 3 శాతం దాకా క్షీణించింది.