For Money

Business News

లాభాల్లో ముగిసిన నిఫ్టి

మే డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ పాజిటివ్‌గా ముగిసింది. నిఫ్టిలో భారీ హెచ్చుతగ్గులు లేవు…కాని దిగువ స్థాయిలో మద్దతు అందడం, స్వల్పంగా షార్ట్‌ కవరింగ్ రావడంతో నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. నిఫ్టి క్లోజింగ్‌ సమయంలో 16204 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. 16170 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 144 పాయింట్లు లాభపడింది. నిఫ్టి షేర్లలో మాత్రం అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నాలుగు శాతం దాకా నష్టంలో ఉన్న అపోలో హాస్పిటల్‌.. క్లోజింగ్‌ సమయానికల్లా 5 శాతం లాభంతో టాప్‌ గెయినర్స్‌లోకి వచ్చేసింది. మెటల్స్‌ ఎలాగూ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ కూడా ఇవాళ బలపడ్డాయి. కాని దివీస్‌ ల్యాబ్‌ను దారుణంగా కొట్టేశారు. ఇవాళ ఆ షేర్‌ రూ. 3365ను తాకి రూ. 3448 వద్ద ముగిసింది. ఫలితాలు వచ్చిన తరవాత ఈ షేర్‌ రూ.1000 తగ్గడం విశేషం. ఇక సూచీల విషయానికొస్తే నిఫ్టి బ్యాంక్‌ రారాజుగా 2.2 శాతం లాభంతో ముగిసింది. ఈ కౌంటర్లను చితక్కొట్టిన విదేశీ ఇన్వెస్టర్లు ఇవాళ షార్ట్‌ కవరింగ్‌కు పాల్పడంతో షేర్ల ధరలు పెరిగాయి. కాని వీటి కాల్స్‌ కొన్నవాళ్ళు ఎలాంటి లాభం లేకుండా పొజిషన్స్‌ క్లోజ్‌ చేసుకున్నారు. ఫ్యూచర్స్‌ కొన్నవారు లాభపడ్డారు. ఇక నిఫ్టి నెక్ట్స్‌ కూడా 1.4 శాతం లాభపడింది. మిడ్‌క్యాప్‌ నిఫ్టి 0.9 శాతం లాభంతో ముగిసింది.