For Money

Business News

ఈ షేర్లు 50 శాతం దాకా పడ్డాయి

న్యూజనరేషన్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. మార్కెట్‌ ఏమాత్రం బలహీనంగా ఉన్నా …వెంటనే ఈ షేర్లలో అమ్మకాలు వస్తున్నాయి. నిజానికి ఈ షేర్ల అసలు సత్తా ఏమిటో తెలియకపోవడంతో… షేర్లు ఇంకా పడుతూనే ఉన్నాయి. ఫండమెంటల్స్‌ బలహీనంగా ఉన్నాయని ప్రచారం జరిగిన పీటీఎం నుంచి అద్భుత కంపెనీగా ప్రచారం జరిగిన నైకా వరకు అన్ని న్యూ జపనరేషన్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా జొమాటొ వంటి షేర్లు కూడా పడుతూనే వస్తున్నాయి. ఇవాళ జొమాటో షేర్ మరో 7 శాతం క్షీణించి రూ. 93.50కి చేరింది. ఈ షేర్‌ రూ.169 నుంచి పడుతూ వస్తోంది. నైకా షేర్‌ 4 శాతంపైగా క్షీణించి రూ. 1571కి పడింది. రూ.2573 నుంచి ఈ షేర్‌ పడుతూనే వస్తోంది. ఇక పేటీఎం షేర్‌ పతనం ఎక్కడ ఆగుతుందో ఇన్వెస్టర్లకు తెలియడం లేదు. అనలిస్టులు చెబుతున్న మద్దతు స్థాయిలను ఈ షేర్‌ బ్రేక్‌ చేస్తూనే ఉంది. ఇవాళ రూ. 881కి చేరింది. మొన్న ఈ షేర్‌ రూ.875ని తాకిన విషయం తెలిసిందే. రూ. 2150 నుంచి ఈ షేర్‌ పడుతూనే ఉంది. కార్‌ ట్రేడ్‌ ఇవాళ కూడా 5 శాతం క్షీణించి రూ. 669కు పడింది. ఈ షేర్‌ గత ఏడాది ఆగస్టులో రూ.1618ని తాకింది. అంటే సగానికిపైగా క్షీణించింది. పీబీ ఫిన్‌టెక్‌ కూడా సగానికి పైగా పడింది. గత నవంబర్‌ 17న రూ.1470ని తాకిన ఈ షేర్‌ ఇవాళ రూ. 745ను తాకింది. మొన్న ఈ షేర్‌ రూ.725ని తాకింది. ఈ షేర్లు మరి ఎంత వరకు పడుతాయి? ఎక్కడ ఇవి స్థిరపడుతాయన్నది మార్కెట్‌లో ఎవరూ చెప్పలేకపోతున్నారు. పబ్లిక్‌ ఇష్యూ సమయంలో తమ వాస్తవ విలువను విస్మరించి భారీ వ్యాల్యూయేషన్‌తో ఈ షేర్లు మార్కెట్‌లో లిస్ట్‌ కావడం దీనికి ప్రధాన కారణం.