For Money

Business News

300 పాయింట్లకు పైగా క్షీణించిన నిఫ్టి

ఓపెనింగ్‌లోనే నిఫ్టి భారీగా నష్టపోయింది. 16,958 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తతం 16,988 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 289 పాయింట్లు నష్ట పోయింది. ఐటీ షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో ఓఎన్‌జీసీ ఒక్కటే లాభాల్లో ఉంది. మిగిలిన 49 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, విప్రో షేర్లు మూడు శాతం పైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇతర సూచీలన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి. న్యూజనరేషన్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. నజారా టెక్‌, జొమాటోతో సహా ఇతర షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి.