For Money

Business News

20 శాతం తగ్గిన నెస్లే లాభం

మ్యాగీ తయారు చేసే కంపెనీ నెస్లే ఇండియా డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసానికి రూ.386 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ. 483 కోట్లతో పోలిస్తే 20 శాతం తగ్గింది. అనలిస్టుల అంచనాల మేరకు కంపెనీ నికర లాభం సాధించలేకపోయింది. అనలిస్టులు రూ.522 కోట్ల నికర లాభం అంచనా వేశారు. కంపెనీ ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగి రూ. 3417 కోట్ల నుంచి రూ.3706 కోట్లకు పెరిగింది. ముడిపదార్థాల ధరలు, ప్యాకేజింగ్‌ ఖర్చు పెరగడం వల్ల కంపెనీ నికర లాభం క్షీణించిందని కంపెనీ పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.65 ఫైనల్‌ డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. డివిడెండ్‌కు రికార్డు తేదీ ఏప్రిల్‌ 8. ఏప్రిల్‌ 26న డివిడెండ్‌ చెల్లిస్తారు. పూర్తి ఏడాదికి కంపెనీ రూ. 2148 కోట్ల నికరలాభం ఆర్జించింది. ఈ ఏడాదిలో కంపెనీ రూ.3810 కోట్ల పన్నులు చెల్లించినట్లు నెస్లే ఇండియా పేర్కొంది. అలాగే పూర్తి ఏడాదికి కంపెనీ ఇచ్చిన డివిడెండ్ రూ.200.