For Money

Business News

నాట్కో ఫార్మా నష్టం రూ.50 కోట్లు

మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి నాట్కో ఫార్మా కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 610 కోట్ల టర్నోవర్‌పై రూ.50.5 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 360 కోట్ల ఆదాయంపై రూ. 53కోట్ల నికర లాభం ప్రకటించింది. అదే పూర్తి ఏడాది ఫూలితాలను చూస్తే.. రూ. 2043 కోట్ల టర్నోవర్‌పై రూ. 170 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ఆర్జించింది. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో లాభాలు తగ్గడానికి కారణం మొత్తం ఏడాదికి రూ.232 కోట్ల ఇన్వెంటరీ విలువను రద్దు చేయడంతో పాటు క్రెడిట్‌ నష్టాలకు రూ.46 కోట్లు కేటాయించడమేనని కంపెనీ పేర్కొంది. లేకుంటే ఆకర్షణీయ లాభాన్ని కంపెనీ ప్రకటించేదని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఆకర్షణీయ వృద్ధి సాధిస్తామని కంపెనీ పేర్కొంది.