For Money

Business News

నాస్‌డాక్‌ జోరు

ఇవాళ వాల్‌స్ట్రీట్‌లో మిశ్రమ ధోరణి వ్యక్తమైంది. డౌ జోన్స్ నష్టాల్లో ఉండగా… నాస్‌డాక్‌ ఏకంగా ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా అర శాతంపైగా లాభంతో ఉంది. వడ్డీ రేట్ల తగ్గింపుపై మార్కెట్‌ ఆశాభావంతో ఉంది. ఈ నేపథ్యంలో డాలర్‌ కూడా కాస్త బలహీనపడింది. డాలర్‌ ఇండెక్స్‌ మళ్ళీ 102 దిగువకు వచ్చేసింది. అలాగే సౌదీ అరేబియా ధరలు తగ్గించడంతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 76 డాలర్ల దిగువకు వచ్చేసింది. డాలర్‌ పతనంతో పాటు బంగారం కూడా స్వల్పంగా క్షీణించింది. అయితే వెండి మాత్రం నామమాత్రపు లాభంతో ట్రేడవుతోంది.