For Money

Business News

లాభాల స్వీకరణ

నిన్న భారీ లాభాలు పొందిన నాస్‌డాక్‌ ఇవాళ స్వల్ప ఒత్తిడికి గురైంది. నిన్న స్థిరంగా నామమాత్రపు నష్టాల్లో ఉన్న డౌజోన్స్‌ ఇవాళ 0.75 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.5 శాతం నష్టంతో ఉంది. ఐటీ, టెక్‌ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా నాస్‌డాక్‌ 0.4 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఈ వారాంతంలో వచ్చే ద్రవ్యోల్బణ డేటా కోసం మార్కెట్‌ ఎదురు చూస్తోంది. దీంతో డాలర్‌ మళ్ళీ బపడింది. డాలర్‌ ఇండెక్స్‌ ఇపుడు 102పైన ట్రేడవుతోంది. మరోవైపు క్రూడ్‌ ఆయిల్‌ కూడా ఇవాళ పుంజకుంది. బ్రెంట్‌ క్రూడ్‌ 77 డాలర్ల ప్రాంతంలో ఉంది. ఇక బులియన్‌ మార్కెట్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు లేవు.