For Money

Business News

దుమ్ము రేపిన వాల్‌స్ట్రీట్‌

వడ్డీ రేట్లు పెంచే విషయంలో జోరు తగ్గిస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చేసిన వ్యాఖ్యలతో రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. వాషింగ్టన్‌లోని బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో ఆయన మాట్లేందుకు సిద్ధం చేసిన ప్రసంగం కాపీ నిన్న రాత్రి బయటకు వచ్చింది. వాల్‌స్ట్రీట్‌లోమూడు సూచీలు కూడా భారీగా పెరిగాయి. డౌజోన్స్‌ రెండు శాతం, ఎస్‌ అండ్‌ పీ మూడు శాతం, నాస్‌డాక్‌ 4.4 శాతం పెరిగాయి. పావెల్‌ స్పీచ్‌ తరవాత డాలర్‌ తగ్గడం క్రూడ్‌, బులియన్‌ పెరగడం వెంటనే జరిగిపోయాయి. బ్రెంట్ క్రూడ్‌ 88 డాలర్లకు చేరువైంది.ఇక ఆసియా మార్కెట్లలో కూడా ఇదే జోష్‌ కన్పిస్తోంది. దాదాపు అన్ని మార్కెట్లు గ్రీన్లో ఉన్నాయి. చాలా మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతోఉండగా … చైనా, హాంగ్‌సెంగ్‌ మార్కెట్లు రెండు శాతంపైగా లాభంతో ఉన్నాయి. అలాగే నిక్కీ ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది. మన మార్కెట్లు నిన్న భారీ లాభాలతో ముగిశాయి. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్ కూడా. సింగపూర్‌ నిఫ్టి 80 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి ఇవాళ భారీ లాభాలు పొందే అవకావముంది.