For Money

Business News

LEVELS: లాభాలు తీసుకోండి

మార్కెట్‌ ఇవాళ భారీ లాభాలతో ప్రారంభం కానుంది. బై ఆన్‌ డిప్స్‌ పద్ధతిలో షేర్లు కొన్నవారు ఇవాళ ఓపెనింగ్‌లో బయటపడటం మంచిదని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. చాలా మంది అనలిస్ట్‌లు నిన్న క్లోజింగ్‌ సమయంలోనే సగం పొజిషన్‌లో లాభాలు స్వీకరించమని సలహా ఇచ్చారు. మిగిలిన సగం ఇవాళ అమ్మేయమని సలహా ఇస్తున్నారు. వర్టికల్‌ ర్యాలీ వచ్చినపుడు వెంటనే లాభాలు స్వీకరించి పక్కన నిలబడటం చాలా మందదని వీరు సూచిస్తున్నారు. నిఫ్టి ఓపెనింగ్‌ తరవాత 18750 లేదా 18700 ప్రాంతానికి వస్తేనే కొనుగోలు చేయాలని లేదా 18850 పైన గంట వరకు ట్రేడైతేనే నిఫ్టిని కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. నిఫ్టిని ఎలాంటి పరిస్థితుల్లో షార్ట్‌ చేయొద్దని సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ అనూజ్‌ సింఘాల్‌ సలహా ఇస్తున్నారు. సూచీలు మరింతగా పెరిగే అవకాశముందని.. అయితే వరుసగా రోజూ సూచీలు పెరగవన్న అంశాన్ని ఇన్వెస్టర్లు గుర్తించాలని అన్నారు. అలాగే ఐటీ సూచీ బదలు.. ఎంపిక చేసిన ఐటీ షేర్లలో ట్రేడింగ్‌ చేయడం ఉత్తమమని అనూజ్‌ సలహా ఇస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిఫ్టిని షార్ట్‌ చేయొద్దని అన్నారు. కాల్ రైటింగ్‌ 18800, 18900వద్ద చాలా అధికంగా ఉందని తెలిపారు.