For Money

Business News

మైండ్‌ట్రీ నికర లాభంలో 34 శాతం వృద్ధి

మిడ్‌క్యాప్ ఐటి కంపెనీ మైండ్‌ట్రీ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో చక్కటి వృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 34 శాతం పెరిగి రూ. 437.50 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయం 35.9 శాతం శాతం మాత్రం పెరిగి రూ.2,750 కోట్లకు చేరింది. సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం 13శాతం పెరగ్గా నికర లాభం 9.7 శాతం పెరిగింది. అటు మొత్తం కాంట్రాక్ట్ విలువ 120 కోట్ల డాలర్లకు చేరింది. బలమైన డిమాండ్, కస్టమర్ మైనింగ్ మరియు ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సామర్థ్యాల నేపథ్యంలో మూడవ త్రైమాసికంలో సానుకూల రాబడి సాధించామని కంపెనీ తెలిపింది. డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో మైండ్‌ట్రీలో 31,959 మంది ఉద్యోగులు ఉన్నారు.
మైండ్‌ట్రీ షేర్ ధర గురువారం 2.36 శాతం అంటే రూ. 108 పెరిగి బీఎస్‌ఇలో రూ.4,743.80 వద్ద ముగిసింది.