For Money

Business News

ఎల్‌ఐసీ ఐపీఓ రూ. 90,000 కోట్లు!

ఈనెలలోనే ఐపీఓకు సంబంధించిన డాక్యుమెంట్లను సెబి వద్ద ఎల్‌ఐసీ సమర్పించుంది. ప్రజల నుంచి రూ. 90,000 కోట్లు సమీకరించేందుకు ఎల్‌ఐసీ సిద్ధమౌతోందని రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ వ్యాల్యూయేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇది పూర్తవుతునే షేర్‌ ధర ఖరారు చేసే అవకాశముంటుంది. ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన వెంటనే అంటే వచ్చే నెలలోనే రోడ్‌ షోలను ఎల్‌ఐసీ ప్రారంభించనుంది. మార్చి నెల మధ్యలో పబ్లిక్‌ ఆఫర్‌ మార్కెట్‌లోకి రానుంది. అంటే అదే నెలలోనే లిస్టవుతుందన్నమాట. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి సాధారణ ఇన్వెస్టర్లు కూడా ఎల్‌ఐసీ ఆఫర్‌ కోసం ఎదురు చూస్తున్నారు. జీవిత బీమా రంగంలో ఈ కంపెనీకి మెజారిటీ వాటా ఉన్నందున… మంచి ప్రతిఫలాలు అందుతాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.