For Money

Business News

MID SESSION: నిఫ్టిలో డబుల్‌ ప్రాఫిట్‌

ఉదయం టెక్నికల్‌ అనలిస్టులు వేసిన అంచనా మేరకు నిఫ్టి ఇవాళ రెండు వైపులా కదలాడింది. దీంతో ఆల్గో ట్రేడర్స్‌కు భారీ లాభాలు వచ్చాయి. పూర్తిగా టెక్నికల్‌గా సాగిన నిఫ్టి సరిగ్గా ప్రతిఘటన స్థాయిని తాకి… ఇవాళ్టి కనిష్ఠ స్థాయిని తాకింది.ఇదంతా మిడ్‌ సెషన్‌కే పూర్తి కావడం విశేషం. ఉదయం ఆల్గో లెవల్స్‌లో మొదటిది ఓపెనింగ్‌లో 15,850పైన అమ్మడం. స్టాప్‌లాస్‌ 15870. నిఫ్టి 15,862 గరిష్ఠ స్థాయిని తాకి మిడ్‌ సెషన్‌ కల్లా 15,702ని కూడా తాకింది. నిఫ్టి 15800 దిగువకు వస్తే మాత్రం 15720 వరకు మద్దతు లేదని, 15750 దిగువకు వస్తే 15700 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయమని ఆల్గో ట్రేడర్స్‌ ఉదయం వేసిన అంచనా. నిఫ్టి 15,702ని తాకి ఇపుడు 15,781 వద్ద ట్రేడవుతోంది. మిడ్ క్యాప్‌లో కొన్ని షేర్లు లాభపడుతున్నా నిఫ్టి, నిఫ్టి నెక్ట్స్‌ సూచీల్లోని షేర్లలో అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. బ్యాంక్‌ నిఫ్టి పరిమిత లాభాలతోనే ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. లాభనష్టాలు పరిమితంగా ఉన్నాయి. రిస్క్‌ వొద్దనుకునే ఇన్వెస్టర్లు మిడ్‌ సెషన్‌లో బయటపడి పోవడం ఉత్తమం.