For Money

Business News

నిఫ్టి: ఓపెనింగ్‌లోనే లాభాల స్వీకరణ

డే ట్రేడర్స్‌కు ఆరంభంలోనే.. కొన్ని నిమిషాల్లోనే… లాభాల పంట. ఊహించినట్లే 15,850పైన అమ్మకాల ఒత్తిడి వచ్చింది. 15,862ని తాకిన వెంటనే కొన్ని నిమిషాల్లోనే 15,807ని తాకింది. ఉదయం నిఫ్టిని 15,870 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మమని సలహా ఇచ్చిన టెక్నికల్‌ అనలిస్టుల అంచనా నిజమైంది. ఊహించినట్లే ఆల్గో ట్రేడింగ్‌ సాగింది. మార్కెట్‌ బలం,బలహీనతలతో సంబంధం లేకుండా కేవలం టెక్నికల్‌ నంబర్లను మాత్రమే నమ్మి సెల్‌, బై పొజిషన్స్‌ ఫిక్స్‌ చేసి ట్రేడ్‌చేసే… ఆల్గో ట్రేడర్లు ఇటీవల భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. నిఫ్టి ప్రస్తుతం 15,808 వద్ద 35.7 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 38 షేర్లు లాభాల్లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి గ్రీన్‌లో ఉన్నా లాభాలు పెద్దగా లేవు. కాని మిడ్‌ క్యాప్‌ సూచీ అర శాతంపైగా లాభంతో ఉంది. నిఫ్టి 15,800ని కోల్పోతే.. 15,750 వద్ద మద్దతు లభిస్తుందేమో చూడాలి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
హిందాల్కో 372.75 1.41
హీరో మోటోకార్ప్‌ 2,948.00 1.41
టాటా మోటార్స్‌ 342.50 1.36
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,013.70 1.36
టైటాన్‌ 1,778.45 1.22

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
శ్రీ సిమెంట్‌ 29,060.20 -0.61
టెక్ మహీంద్రా 1,050.85 -0.60
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 6,825.00 -0.49
ఏషియన్‌ పెయింట్‌ 2,997.05 -0.46
ఐఓసీ 113.50 -0.31