For Money

Business News

కీలక మద్దతు స్థాయి కోల్పోయిన నిఫ్టి

అరశాతంపైగా లాభంతో ప్రారంభమైన ఇవాళ్టి నిఫ్టి ప్రయాణం అరశాతం నష్టంతో ముగిసింది. ఇవాళ ప్రధాన మద్దతు స్థాయిని నిఫ్టి కోల్పోయి 15,700 దిగువన 15,686 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 86 పాయింట్లు నష్టపోయింది. దాదాపు అన్ని సూచీలు నష్టాలతో ముగిశాయి. ఉదయం 15,862 వద్ద ప్రారంభమైన నిఫ్టి 10.15గంటలకే నష్టాల్లోకి జారుకుంది. మిడ్‌ సెషన్‌కల్లా 15,702 పాయింట్లను తాకింది. కాని 2 గంటలకల్లా 15,783 పాయింట్లను తాకినా… వెంటనే వచ్చిన అమ్మకాల ఒత్తిడితో ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 15,673కి పడిపోయింది. గరిష్ఠ స్థాయి నుంచి 190 పాయింట్లు క్షీణించిందన్నమాట. పతనం మిడ్‌ క్యాప్‌ షేర్లలో తక్కువగా ఉంది. ఓ రెండు రోజులు గ్రీన్‌లో ఉన్న అదానీ పోర్ట్స్‌ మళ్ళీ పతనం బాట పట్టింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్
మారుతీ 7,432.10 2.29
టైటాన్‌ 1,783.00 1.48
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 12,287.85 1.29
ఎం అండ్‌ ఎం 783.00 1.01
ఓఎన్‌జీసీ 123.25 0.98

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
అదానీ పోర్ట్స్‌ 718.55 -3.28
విప్రో 540.45 -2.89
దివీస్‌ ల్యాబ్‌ 4,225.00 -1.49
శ్రీ సిమెంట్‌ 28,825.15 -1.42
JSW స్టీల్‌ 665.70 -1.41