For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నాయి. నిన్న యూరో మార్కెట్లు ఒకశాతంపైగా నష్టంతో ముగిశాయి. రాత్రి అమెరికా మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. నాస్‌డాక్‌ గ్రీన్‌లో, ఇతర సూచీలు రెడ్‌లో ఉన్నా నామ మాత్రమే. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లదీ అదే పరిస్థితి. ఏ సూచీ కూడా కదల్లేదు. అన్నీ క్రితం స్థాయి వద్దే కదలాడుతున్నాయి. సింగపూర్ నిఫ్టి 20 పాయింట్ల లాభంలో ఉన్నా… నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప నష్టంతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.