For Money

Business News

BUY &SELL;: నిఫ్టికి కీలక స్థాయి 15,600

అంతర్జాతీయ మార్కెట్లన్నీ డల్‌గా ఉన్నాయి. ఆసియా సూచీల్లో అస్సలు మార్పు లేదు. నిఫ్టి మూవ్‌మెంట్‌ చర్చించే ముందు.. ఇవాళ జూన్‌ నెల డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. ముఖ్యంగా రిలయన్స్‌ ఏజీఎం నేపథ్యంలో ఇవాళ్టి ట్రేడింగ్‌ కీలకం కానుంది. అలాగే డాలర్‌తో పాటు క్రూడ్‌ పెరుగుతోంది. రాత్రి బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు 76 డాలర్లను తాకాయి.ఇపుడు స్వల్ప నష్టాలతో ఉన్నా… డాలర్‌ బలంతో మన కొనుగోలుదారులకు కష్టమే. పెట్రోల్‌,డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సిరీస్‌ రేపు ప్రారంభం కానుంది. కొత్త సిరీస్‌లో తొలి త్రైమాసికం ఫలితాలు ఉంటాయి. కాబట్టి రోల్‌ఓవర్స్‌ కూడా ముఖ్యమే. ఇక ఇవాళ్టి నిఫ్టి విషయానికొస్తే… చిన్న ఇన్వెస్టర్లు ఇవాళ ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం బెటర్‌. నిఫ్టికి ఇవాళ 15,600 చాలా కీలకం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 15,686. సో నిఫ్టి ఇవాళ 15,700పైన ప్రారంభం కానుంది. ఇంట్రా డే పొజిషన్స్‌ చూస్తే నిఫ్టికి తొలి ప్రతిఘటన 15,740-15,750 మధ్య రానుంది. నిఫ్టి మూడ్ పాజిటివ్‌గా ఉంటే ఈ స్థాయి వరకు ఆగండి. వస్తే 15,775 స్టాప్‌లాస్‌ అమ్మండి. స్టాప్లాస్‌ను తాకితే… అమ్మకండి. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 15,740 ప్రాంతంలోనే అమ్మొచ్చు. నిఫ్టి ఏమాత్రం వీక్‌గా కన్పించినా.. నిఫ్టి 15,620 వరకు ఎలాంటి మద్దతు లేదు. ఈ స్థాయి కోల్పోతే15,600, 15,570 తరువాతి స్థాయిల్లో మద్దతు అందవచ్చు. సో సింపుల్‌. ఓపెనింగ్‌లో అమ్మండి. వెయిట్‌ చేయండి. నిఫ్టి వీక్‌గా ఉంటే నిఫ్టి కచ్చితంగా 15,620ని తాకొచ్చు. రిస్క్‌ వొద్దనుకునేవారు స్వల్ప లాభంతో బయటపడొచ్చు. ఇంట్రా డేకు నిఫ్టి రేంజ్‌ 15,600-15,750. మార్కెట్లన్నీ డల్‌గా ఉన్నందున.. నిఫ్టిని ప్రభావితం చేసే అంశం కేవలం మంత్లి, వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ మాత్రమే.