For Money

Business News

LEVELS: 18000 కీలకం

మార్కెట్‌ ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమైనా… ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిఫ్టిలో దిగువ స్థాయిలో కొనడానికి, అధిక స్థాయిలో అమ్మడానికి ఛాన్స్‌ ఉంది. నిఫ్టి కన్నా బ్యాంక్‌ నిఫ్టి చాలా పాజిటివ్‌గా ఉంది. నిఫ్టి లెవల్స్‌లో నిన్నటి కనిష్ఠ స్థాయిలో 18133. 18050, 1800 కీలక స్థాయిలను సీఎన్‌బీసీ ఆవాజ్‌ మేనేజింగ్ ఎడిటర్‌ అనూజ్ సింఘాల్‌ అంటున్నారు. నిఫ్టి 18000 పైన ఉన్నంత వరకు మార్కెట్‌ పాజిటివ్ జోన్‌లో ఉన్నట్లుగానే పరిగణించాలని అంటున్నారు. నిఫ్టి కాల్ రైటింగ్‌ 18200, 18300 ప్రాంతంలో అధికంగా ఉంది. కాబట్టి ఈ స్థాయిల్లో నిఫ్టి గట్టి ప్రతిఘటన ఎదురు కావొచ్చు. ర్యాలీ రావాలంటే నిఫ్టి 18350ని దాటాల్సి ఉందని అనూజ్‌ అంటున్నారు. అయితే ఆ పరిస్థితి ఈ వారం ఉండకపోవచ్చని అన్నారు. సో… 18000 లేదా 18050 స్టాప్‌లాస్‌తో నిఫ్టి కొనుగోలు చేయొచ్చని ఆయన అంటున్నారు. అలాగే 18250పైన 18300 లోగా అమ్మవచ్చని అంటున్నారు. 18109 స్థాయిని నిలబెట్టుకుంటే నిఫ్టి గ్రీన్‌లోనే ఉండే అవకాశముంది. కాల్‌ రైటింగ్‌ 18200 కాల్‌లో ఓపెన్‌ ఇంటరెస్ట్‌ 1.21 కోట్లు, 18400 కాల్‌ ఓపెన్‌ ఇంటరెస్ట్‌ 1.12 కోట్లు ఉన్నాయి. ఇక పుట్‌ రైటింగ్‌ విషయానికొస్తే 18200 పుట్‌ రైటింగ్‌ 44.51 లక్షలు, 18000 పుట్‌ రైటింగ్‌ 69.88 లక్షల ఓపెన్‌ ఇంటరెస్ట్‌ ఉంది.