For Money

Business News

కిమ్స్‌ లాభం రూ.92 కోట్లు

ఇటీవల పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన హైదరాబాద్‌ కంపెనీ కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సస్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి రూ.92 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.8.9 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఆదాయం కూడా రూ.205.5 కోట్ల నుంచి రూ.477.5 కోట్లకు చేరినట్లు కిమ్స్‌ వెల్లడించింది. గత ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా పనితీరును పోల్చడం సరికాదని కంపెనీ పేర్కొంది. షేరుకు ఆర్జన (ఈపీఎస్‌) రూ.1.48 నుంచి రూ.11.48 పెరిగింది. ఇటీవల పబ్లిక్‌ ఇష్యూలో కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా సమీకరించిన రూ.200 కోట్లలో రూ.150 కోట్లను రుణాలు చెల్లించడానికి వినియోగించినట్లు కిమ్స్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి. భాస్కర్‌ రావు తెలిపారు.