‘అంబ్రీ’లో రిలయన్స్ పెట్టుబడులు
విద్యుత్ స్టోరేజీ బ్యాటరీలను తయారు చేసే అమెరికన్ కంపెనీ ‘అంబ్రీ’లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టింది.రెన్యూవబుల్ ఇంధన రంగంలోకి ప్రవేశించేందుకు ఈ మధ్యనే ఏర్పా టు చేసిన తన అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూఎనర్జీ సోలార్ లిమిటెడ్ ద్వారా ఈ పెట్టుబడులు పెట్టింది. రిలయన్స్‌తో పాటు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్, ఇతరులు కలిసి అంబ్రీలో మొత్తం 14.4 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,080 కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. అందులో రిలయన్స్ పెట్టుబడులు 5 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో ఈ విలువ సుమారు రూ.375 కోట్లు. దీంతో రిలయన్స్‌కు అంబ్రీకి చెందిన 4.23 కోట్ల షేర్లు లభించనున్నాయి.