For Money

Business News

కార్వీ ఛైర్మన్‌ పార్థసారథి అరెస్ట్‌

మనీ లాండరింగ్‌ ఆపరోపణల కింద కార్వి స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) సి పార్థసారథిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. పార్థసారథిని కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించిన ఈడీ.. ఆయనను బెంగళూరు నుంచి సిటీ జైలుకు తీసుకు వచ్చారు. హైదరాబాద్‌ సీసీఎస్‌ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పార్థసారథిపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. వందల కోట్ల రూపాయలను పార్థసారథి రూట్‌ చూసినట్లు ఈడీ ఆరోపిస్తోంది. తన వద్ద షేర్‌ అకౌంట్లు నిర్వహిస్తున్న ఇన్వెస్టర్ల షేర్లను ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ వద్ద తాకట్టు పెట్టి రూ. 137 కోట్ల రుణాన్ని పార్థసారథి పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇన్వెస్టర్ల నుంచి ఎలాంటి అనుమతి పొందరకుండా.. వారి డిమాట్‌ అకౌంట్లలో ఉన్న షేర్లను బ్యాంకులో తనఖా పెట్టారు. బ్యాంకు నుంచి తీసుకున్న నిధులను తమ సొంత కంపెనీలకు బదిలీ చేశారు. దాదాపు తరహా మోసం చేసిన రూ. 700 కోట్ల షేర్లను ఈడీ జస్తు చేసింది కూడా.