For Money

Business News

200 పాయింట్లు క్షీణించిన నిఫ్టి

కేవలం అర గంటలోనే ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది నిఫ్టి. ఆరంభంలో వంద పాయింట్ల వరకు క్షీణించిన నిఫ్టి కొన్ని నమిషాల్లోనే దాదాపు నష్టాలను కవర్‌ చేసుకుంది. ఇదంతా అయిదు నిమిషాల్లో జరిగి పోయింది. ఆ తరవాత పది నిమిషాల్లో అసలు అమ్మకాలు మొదలయ్యాయి. నిఫ్టి ఏకంగా 200 పాయింట్లకు పైగా క్షీణించింది. దివీస్‌ ల్యాబ్‌ వంటి షేర్‌ కొన్ని నిమిషాల్లోనే రూ. 4179 నుంచి రూ. 3788కి పడిపోయింది. అంటే దాదాపు పది శాతం క్షీణించిందన్నమాట. మెటల్స్‌లోనూ ఒత్తిడి వచ్చింది. మంచి పనితీరు కనబర్చిన రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లలో కూడా లాభాలు కరిగిపోయాయి. ఈ షేర్లు దాదాపు క్రితం స్థాయిల వద్ద ట్రేడవుతున్నాయి.