For Money

Business News

లోయర్‌ సర్వ్యూట్‌… నో బయ్యర్స్‌

గత కొన్ని రోజలుగా డల్‌గా ఉన్న జూబిలియంట్‌ ఫుడ్‌ స్టాక్‌ ఇవాళ లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌ క్రితం ముగింపు రూ. 2864 కాగా, ఇపుడు రూ. 2578 వద్ద ఉంది. ఈ ధర వద్ద కూడా ఎన్‌ఎస్‌ఈలో 1.67 లక్షల మంది అమ్మకందారులు ఉన్నారు. కాని కొనుగోలుదారులు లేరు. కంపెనీ షేర్‌ ఈ స్థాయిలో పతనం కావడానికి ప్రధాన కారణం… కంపెనీ సీఈఓ, హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ రష్మికాంత్‌ పొటా రాజీనామా చేయడమే. మార్చి 11వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో ప్రతీక్‌ రాజీనామాను ఆమోదించారు. అనేక బ్రోకింగ్‌ సంస్థలు ఈ కంపెనీ షేర్‌ ప్రైస్‌ టార్గెట్‌ను తగ్గించాయి. క్రెడిట్‌ సూసె టార్గెట్‌ ధర రూ. 3500 నుంచి రూ.2900లకు తగ్గించగా, మోర్గాన్‌ స్టాన్లీ రూ. 5000 నుంచి రూ. 2250కి తగ్గించేసింది. జేపీ మోర్గాన్‌ కూడా టార్గెట్‌ ప్రైస్‌ను రూ. 4025 నుంచి రూ. 3000లకు తగ్గించింది. సీఈఓ ఆకస్మిక రాజీనామా కంపెనీ పనితీరుపై స్వల్పంలో ప్రతికూలంగా ఉంటుందని అనలిస్టులు అంటున్నారు.