For Money

Business News

పేటీఎం ఇన్వెస్టర్లకు పీడకల

పేటీఎం షేర్‌ లిస్టింగ్‌ సమయం నుంచి ఇన్వెస్టర్లకు షాక్‌లపై షాక్‌లు తగులుతున్నాయి. షేర్‌ ధర ఏ మాత్రం పెరిగినా… తీవ్ర ఒత్తిడి వస్తోంది. తాజాగా ఆర్బీఐ విధించిన ఆంక్షల కారణంగా పేటీఎం ఏకంగా 12 శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. తాజా సమాచారం మేరకు ఈ షేర్‌ రూ. 775 నుంచి రూ. 681కు క్షీణించింది. ఒక్కో షేర్‌ను రూ. 2150కి పేటీఎం షేర్లను ఆఫర్‌ చేసింది. ఇపుడు ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి షేర్‌ క్షీణించింది. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.44,391 కోట్లకు పడిపోయింది. పీటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ త్వరలోనే స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ పొందుతుందని ఆశతో ఉన్న ఇన్వెస్టర్లు ఆర్బీఐ చర్యతో షాక్‌ తిన్నారు. పేమెంట్‌ బ్యాంక్‌ కస్టమర్లకు సంబంధించిన కేఎఫ్‌సీ నిబంధనలను పేటీఎం పాటించడం లేదని, ఇలాంటి ఘటనలు అధికంగా ఉన్నందున చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ అంటోంది. తాము వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని పేటీఎం పేర్కొంది. రూ. 681 వద్ద కూడా ఈ షేర్‌ కొనుగోలుకు అనలిస్టలు రెకమెండ్‌ చేయడం లేదు.