For Money

Business News

అంచనాలను మించిన ఐటీసీ ఫలితాలు

మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ కంపెనీ రూ. 16426 కోట్ల ఆదాయంపై రూ. 4190 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 14,156 కోట్ల ఆదాయంపై రూ. 3,748 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంటే కంపెనీ ఆదాయం 16 శాతం పెరగ్గా, నికర లాభం 11.80 శాతం పెరిగింది. మార్కెట్‌ వర్గాలు ఈ త్రైమాసికంలో రూ. 4118 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని భావించారు. కంపెనీ మార్కెట్‌ అంచనాలను దాటిందన్నమాట. ఒక్కో షేర్‌కు రూ. 6.25 చొప్పున ఫైనల్‌ డివిడెండ్‌ ఇవ్వాలని నిర్ణయించింది. కంపెనీ ఇది వరకే రూ. 5.25 చొప్పున తాత్కాలిక డివిడెండ్‌ను ఇచ్చింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ సిగరెట్‌ విభాగం వ్యాపారం 9.96 శాతం పెరిగి రూ. 6443 కోట్లకు చేరగా, నాన్‌ సిగరేట్‌ విభాగం 12.32 శాతం వృద్ధి చెంది రూ. 4141 కోట్ల ఆదాయం సాధించింది. కంపెనీ హోటల్‌ విభాగం ఆదాయం 35.59 శాతం, ఆగ్రి బిజినెస్‌ విభాగం ఆదాయం 29.6 శాతం పెరిగింది.