For Money

Business News

2025 నుంచి పెట్రోల్‌లో 20 శాతం ఎథనాల్‌

ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ భేటీ అయిన కేంద్ర కేబినెట్‌ బయోఫూయల్స్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2018లో మెడీ ప్రభుత్వం తెచ్చిన బయో ఫూయల్‌ పాలసీకి మార్పులు చేయాలని ఇవాళ కేబినెట్‌ నిర్ణయించారు. సవరణ ప్రకారం 2025 – 2026 ఆర్థిక సంవత్సరం నుంచి పెట్రోల్‌లో 20 శాతం ఎథనాల్‌ కలిపేందుకు కేబినెట్‌ అంగీకరించింది. గతంలో ఈ డెడ్‌లైన్‌ 2030-31గా ఉండేది. ఇపుడు పది శాతం ఎథనాల్‌ను కలుపుతున్నారు. అంటే 2025 నుంచి లీటర్‌ పెట్రోల్‌లో 80 శాతం పెట్రోల్‌, 20 శాతం ఎథనాల్‌ ఉంటుందన్నమాట. అలాగే ఎథనాల్ తయారీకి వాడే ముడిదార్థాల్లో కొత్తవాటిని చేర్చారు. ఎస్‌ఈజడ్‌లలో బయోఫూయల్‌ యూనిట్‌లను ప్రోత్సహించాలని కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.