For Money

Business News

ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ?

ఆన్ లైన్‌ గేమింగ్‌, క్యాసినో, రేస్‌ కోర్స్‌లపై 28శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌తోపాటు ఇతర గేమ్స్‌పై జీఎస్టీకి సంబంధించి పలు అసమానతలు ఉన్నాయి. వీటి పరిష్కారినిక జీఎస్టీ కౌన్సిల్‌ మేఘాలయ సీఎం కాన్నాడ్‌ సంగ్మా నేతృత్వంలో ఓ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం తన సిఫారసులను జీఎస్టీ కౌన్సిల్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ సిఫారసులపై చర్చించి జీఎస్టీ కౌన్సిల్‌ తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కేంద్ర మంత్రుల సిఫార్స్‌లపై స్కిల్‌గేమింగ్‌ పరిశ్రమ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతమున్న 18 శాతం జీఎస్‌టీ రేటునే కొనసాగించాలని డిమాండ్‌ చేసింది. ప్రతిపాదిత 28 శాతం పన్ను పరిధిలోకి మారిస్తే 220 కోట్ల డాలర్ల పరిశ్రమపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 400 సంస్థలతో 45,000 మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమకు 18 శాతం జీఎస్‌టీనే కొనసాగించాలని ఆన్‌లైన్‌ స్కిల్‌ బేస్డ్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల సమాఖ్య ఇప్పటికే అధికారులకు వినతిపత్రాన్ని కూడా సమర్పించింది.