For Money

Business News

ఇన్వెస్టర్ల సంపద రూ.60 లక్షల కోట్లు పెరిగింది

నిన్నటితో 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఈ ఏడాదిలో సెన్సెక్స్‌, నిఫ్టీలు 18 శాతానికి పైగా పెరిగాయి. గడిచిన ఏడాది కాలంలో సెన్సెక్స్‌ 9,059.36 పాయింట్లు (18.29 శాతం) లాభపడగా.. నిఫ్టీ 2,774.05 పాయింట్లు (18.88 శాతం) పెరిగింది. బ్లూచిప్‌ కంపెనీల కన్నా చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లు అధిక లాభాలను ఇచ్చాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌-100, స్మాల్‌క్యాప్‌-100 సూచీలు 25 శాతానికి పైగా పెరగడాన్ని ఇదే సూచిస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో కూడా మన స్టాక్‌ మార్కెట్‌ బాగా రాణించాయి. 2021-22లో బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.59,75,686.84 కోట్లు పెరిగి రూ.264,06,501.38 కోట్లకు చేరింది.
అమెరికా వడ్డీ రేట్లను పెంచడం, యుద్ధం, అధిక ధరలు వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా గడచిన మూడు నెలల్లో మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. లేకుంటే సూచీలు ఇంకా మెరుగైన ప్రతిఫలాలను అందించేవి. గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.1.42 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
ఇక కంపెనీల వారీగా చూస్తే రూ.17.81 లక్షల కోట్ల మార్కెట్‌ సంపదతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. టీసీఎస్‌ (రూ.13.83 లక్షల కోట్లు), హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ (రూ.8.15 లక్షల కోట్లు), ఇన్ఫోసిస్‌ (రూ.8.02 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌ (రూ.5.07 లక్షల కోట్లు) తరువాతి స్థానాల్లో ఉన్నాయి.