For Money

Business News

మార్కెట్లోకి ‘డెస్టినీ 125 XTEC’

మార్కెట్లోకి సరికొత్త ‘డెస్టినీ 125 XTEC’ స్కూటర్‌ను కొత్త హంగులతో హీరో మోటోకార్ప్‌ ప్రవేశ పెట్టింది. ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.69,900. 125 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ స్కూటర్‌ 9 బీహెచ్‌పీ శక్తితో నడుస్తుంది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్‌ స్టాండర్డ్‌ రకం రూ.69,900గాను, అధిక స్పెసిఫికేషన్స్‌ ఉన్న మోడల్‌ ధర రూ.79,990గా నిర్ణయించింది. స్టాప్‌-స్టార్ట్‌ సిస్టమ్‌, యూఎస్‌బీ చార్జర్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీతో డిజి అనలాగ్‌ స్పీడ్‌మీటర్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. కొత్త ఫీచర్‌ను జత చేయడంతో వినియోగదారుల ఆసక్తి పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.