For Money

Business News

పొదుపు మొత్తాలపై అదే వడ్డీ

బయట బ్యాంకులు పోటీ పడి వడ్డీ రేట్లు పెంచుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీ రేట్లను పెంచలేదు. ఇపుడు ఉన్న రేట్లే సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొంది. సాధారణంగా ప్రభుత్వ బాండ్లపై ఇచ్చే వడ్డీ కంటే 0.25 శాతం నుంచి ఒక శాతం అధికంగా పొదుపు మొత్తాలపై చెల్లించాలని శ్యామల గోపీనాథ్‌ కమిటీ సిఫారసు చేసింది. గత పరపతి విధానంలో రెండుసార్లు సీఆర్‌ఆర్‌ను ఆర్బీఐ 0.9 శాతం పెంచింది. ఆ మేరకు బ్యాంకు వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అయితే బ్యాంకు వడ్డీ రేట్ల కన్నా ఎక్కువ వడ్డీ ఉందనే సాకుతో ప్రభుత్వం ఈసారి వడ్డీ రేట్లను మార్చలేదని తెలుస్తోంది. పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్‌ సిటీజన్స్ స్కీమ్‌, పోస్టాఫీస్‌ టర్మ్‌ డిపాజిట్లపై పాత వడ్డీ రేట్లే కొనసాగుతాయి.