For Money

Business News

మెట్రో స్టేషన్లలో అద్దెకు ఆఫీసులు

హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లలో ఆఫీసులను అద్దెకు ఇవ్వనున్నారు. 49 మెట్రో స్టేషన్లలో దాదాపు 4 లక్షల చదరపు అడుగుల స్థలంలో వీటిని అభివృద్ధి చేశారు. 49 స్టేషన్లలో 1750 చదరపు అడుగుల కో వర్కింగ్‌ స్పేస్‌తో రెండు యూనిట్లు ఉండేలా డిజైన్‌ చేశారు. ఎనిమిది స్టేషన్లలో 5000 చదరపు అడుగుల నుంచి 30000 చదరపు అడుగుల స్పేస్‌తో ఈ ఆఫీసులు ఉన్నాయి. వీటిని లీజుకు ఇస్తారు. మొత్తం మీద 57 మెట్రోస్టేషన్లలో ఈ ఆఫీసులు అద్దెకు లభిస్తాయని హైదరాబాద్‌ మెట్రో పేర్కొంది.