For Money

Business News

ఇన్ఫోసిస్‌ నికర లాభం 12 శాతం అప్‌

మార్చినెలతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ కంపెనీ రూ. 32,276 కోట్ల ఆదాయంపై రూ. 5,686 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీరూ. 26,311 కోట్ల ఆదాయంపై రూ.5,076 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ లెక్కన ఆదాయం 22.7 శాతం పెరగ్గా, నికర లాభం 12 శాతం చొప్పున పెరిగాయి. ఈటీ నౌ ఛానల్స్‌ జరిపిన సర్వేలో పాల్గొన్న నిపుణుల అంచనాలకు కాస్త తక్కువగా కంపెనీ పనితీరు ఉంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆపరేటింగ్‌ మార్జిన్‌ 21.5 శాతంగా కంపెనీ పేర్కొంది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీ ఆపరేటింగ్‌ మార్జిన్‌ 24.5 శాతంగా ఉంది. త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఆదాయం ఒక శాతం పెరగ్గా, నిర లాభం 2 శాతం క్షీణించింది.2022-23 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం నుంచి 15 శాతం ఆదాయ వృద్ధి ఉంటుందని కంపెనీ అంచనా వేసింది. అలాగే ఆపరేటింగ్‌ మార్జిన్‌ కూడా 21 శాతం నుంచి 23 శాతం ఉండొచ్చని పేర్కొంది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 1,21,641 కోట్ల ఆదాయంపై రూ. 22,110 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ఆర్జించింది.