For Money

Business News

‘ఘనశ్యామ్‌దాస్‌’ ఆస్తుల జప్తు

హైదరాబాద్‌కు చెందిన ఘనశ్యామ్‌దాస్‌ జెమ్స్‌ అండ్‌ జువలరీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ అగర్వాల్‌కు చెందిన రూ.9.5 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. తప్పుడు పత్రాలు, సంతకాలతో ఎస్‌బీఐ నుంచి 2011లో సంజయ్‌ అగర్వాల్, ఆయన స్నేహితులు రూ. 90 కోట్ల రుణం తీసుకున్నానరు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఇచ్చినట్లుగా తప్పుడు బ్యాంక్ గ్యారంటీ పత్రాలు ఎస్‌బీఐకి సమర్పించి ఆ బ్యాంక్‌ నుంచి 250 కిలోల బంగారాన్ని తీసుకుని.. బహిరంగ మార్కెట్‌లో నగదు అమ్మేశారు. తరవాత తన కుటుంబ సభ్యులతో పేరుతో కొత్తగా మూడు షాపులు, తన ఉద్యోగి పేరుతో మరో షాప్‌ ప్రారంభించారు. బ్యాంకులు భారీ మొత్తం జమ చేశారు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ సంజయ్‌ అగర్వాల్‌పై కేసు నమోదు చేసింది. సీబీఐ దర్యాప్తులో సంజయ్‌ లీలలు బయటపడ్డాయి. ఈ ఏడాది గత ఫిబ్రవరిలో సంజయ్‌ అగర్వాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. తాజా జప్తు చేసిన ఆస్తుల్లో శంషాబాద్,తెల్లాపూర్‌లలో వ్యవసాయ భూములు, రాయదుర్గ్‌లో ఫ్లాట్‌ ఉన్నాయి. ఇంకా కొంపల్లిలో ఓవిల్లా, జూబ్లిహిల్స్‌లో 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న విల్లాను కూడా జప్తు చేశారు.