For Money

Business News

17,500 దిగువన ముగిసిన నిఫ్టి

ఉదయం ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌.. స్వల నష్టాలతో ముగిసింది. మిడ్‌ సెషన్‌లో నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి.. తరవాత క్రితం ముగింపు స్తాయికి వచ్చేందుకు విఫలయత్నం చేసింది. చివరి అరగంటలో వచ్చిన లాభాల స్వీకరణతో నిఫ్టి 17475 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 55 పాయింట్ల నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 237 పాయింట్ల నష్టంతో 58338 వద్ద ముగిసింది. ఇవాళ కూడా నిఫ్టి బ్యాంక్‌ కారణంగా నిఫ్టి నష్టంతో ముగిసింది. ఇవాళ సాయంత్రం ఫలితాలు ప్రకటించనున్న ఇన్ఫోసిస్‌ షేర్‌ నష్టాలను పూడ్చుకుని లాభంతో ముగిసింది. కాని ఎల్లుండి ఫలితాలు ప్రకటించనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఇవాళ 2 శాతం క్షీణించింది. విలీనం ప్రకటన తరవాత బ్యాంక్‌ షేర్‌ రూ.300 తగ్గడం విశేషం. వీక్లీ డెరివేటివ్‌ క్లోజింగ్ కారణంగా చివర్లో ఒత్తిడి వచ్చింది. అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉన్నా… మార్కెట్‌ పట్టించుకోలేదు.