For Money

Business News

72,000 రైల్వే ఉద్యోగాలు రద్దు

రైల్వే విభాగంలో అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నందున 72,000 వేల ఉద్యోగాలను రద్దు చేశారు. మరో 9,000 ఉద్యోగాలను కూడా రద్దు చేయనున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత అంటే 2015-16 నుంచి 2020-21 మధ్యకాలంలో ఈ ఉద్యోగాలను రద్దు చేశారు. ఇవన్నీ అత్యవసరం కాని (No Essential) గ్రూప్‌ సి, గ్రూప్‌ డీ పోస్టులు. పైకి ఆధునిక టెక్నాలజీ అని చెబుతున్నా ప్రభుత్వం చెబుతున్నా… భారీ ఎత్తున ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే 16 జోన్‌ రైల్వే కార్యాలయాలు 56,888 పోస్టులను సరెండర్‌ చేయగా, మరో 15,495 ఉద్యోగాలను కూడా సరెండర్‌ చేయనున్నారు. నార్తర్న్‌ రైల్వే 9000పైగా పోస్టులను సరెండర్‌ చేయగా, సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేస్‌ 4677 పోస్టులు, సదరన్‌ రైల్వే 7524 పోస్టులు, ఈస్టర్న్‌ రైల్వేస్‌ 5700 పోస్టులను సరెండర్‌ చేసింది. 2021-22 ఏడాదికి కూడా సర్వే జరుగుతోందని… మరో 9,000కంటే అధిక పోస్టులను రద్దు చేస్తారని తెలుస్తోంది. రైల్వే ఆదాయంలో మూడో వంతు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు సరిపోతోందని రైల్వే అధికారులు అంటున్నారు. ఉద్యోగాల రద్దు కారణంగా వ్యయం తగ్గుతుందని వీరు అంటున్నారు.