For Money

Business News

భయపెడుతున్న డాలర్‌, క్రూడ్‌

రష్యా నుంచి డిస్కౌంట్‌తో ఎంత ముడి చమురు కొనుగోలు చేశామో.. అధికారిక లెక్కలు లేవు. ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేదు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, డాలర్‌ బలం.. మన ఈక్విటీ మార్కెట్లను కలవర పెడుతోంది. డాలర్‌ బలపడుతున్నా మన మార్కెట్‌లో రూపాయి పతనం కాకుండా ఆర్బీఐ కాపాడుతోంది. దీనివల్ల ముడి చమురు బిల్లు తగ్గుతుందనేది వ్యూహం. కాని అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు తగ్గే అవకాశాలు కన్పించడం లేదు. ఇవాళ కూడా బ్రెంట్‌ క్రూడ్‌ 107 డాలర్లపైనే ఉంటోంది. కాని రూపాయి బలపడకుండా ఇలా కాపాడటం వల్ల ఎగుమతి ప్రధాన ఐటీ, ఫార్మా రంగాలు భారీగా నష్టపోతున్నాయి. కాని ఇలా కృత్రిమంగా ఎంత కాలం రూపాయిని కాపాడుతారని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణలు ప్రశ్నిస్తున్నారు. నిన్న భారత మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి విలువ 77.70ని దాటింది. ఇవాళ ఈక్విటీ మార్కెట్‌ పాజిటివ్‌గా ఉండటంతో రూపాయి కాస్త బలంగా ఉంది. స్పాట్‌ మార్కెట్‌లో రూపాయి 77.40 వద్ద క్లోజైనా… ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి బలహీనపడుతోంది. ఫ్యూచర్స్‌ మే కాంట్రాక్ట్‌ ఇపుడు 77.54 వద్ద ట్రేడవుతోంది. ఇక జూన్‌ కాంట్రాక్ట్‌ 77.70 వద్ద ట్రేడవుతోంది.