For Money

Business News

22-23లో జీడీపీ 8.5శాతమే..

వ‌చ్చే ఆర్థిక సంవ‌త్సరం(2022-23)లో భార‌త్ జీడీపీ వృద్ధిరేటు అంచ‌నాల‌ను ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ భారీగా తగ్గించింది. గ్లోబ‌ల్ ఎక‌న‌మిక్ ఔట్‌లుక్‌-మార్చి 2022 పేరిట నివేదికను ఈ సంస్థ విడుద‌ల చేసింది. 2022-23 ఆర్థిక సంవ‌త్సరంలో భార‌త్ జీడీపీ 10.3శాతం ఉంటుందని ఇదే సంస్థ ఇంతకుమునుపు అంచనా వేసింది. ఉక్రెయిన్‌-ర‌ష్యా మ‌ధ్య యుద్ధం కారణంగా నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగిపోతున్నాయని, దీంతో జీడీపీ వృద్ధి తగ్గనుందని ఫిచ్‌ తెలిపింది. కరోనా కొత్త వేరియంటే త్వరగానే తగ్గడంతో 2021-22లో జీడీపీ వృద్ధిరేటు 0.6 శాతం పెరిగి 8.7 శాతానికి చేరుతుంద‌ని పేర్కొంది. ఇటీవలే మ‌రో రేటింగ్ సంస్థ మూడీస్ కూడా జీడీపీ అంచ‌నాల‌ను కుదించింది.