For Money

Business News

HYD: భూముల ధరలకు రెక్కలు

రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు అత్యధిక రాబడిని అందించే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలతో పాటు సంగారెడ్డి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో భూములు విలువలు, అపార్టుమెంట్‌ ధరలు భారీగా పెరిగాయి. కొత్త మార్కెట్ విలువలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గత ఏడాది జులై 22 న మార్కెట్ విలువలను సవరించగా తాజాగా మరోసారి పెంచారు. శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి, సంగారెడ్డి , యాదాద్రి – భువనగిరి జిల్లా రిజిస్ట్రార్లతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి ప్రత్యేకంగా సమావేశమై పెరిగిన మార్కెట్ విలువలపై తుది పరిశీలన చేసి ఖరారు చేశారు. కొత్త మార్కెట్ విలువులను కమిటీలు శనివారం సాయంత్రంలోపు ఆమోదించేలా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో చదరపు గజం ధర గరిష్ఠంగా రూ.45,500 నుంచి రూ.61,500కు పెరిగింది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాల విలువ భారీగా పెరిగింది. మదీనాగూడలో చదరపు గజం గతంలో రూ.2100 కాగా ప్రస్తుతం రూ.28350 పెరిగింది. హఫీజ్‌పేటలో రూ.3900 కాగా ప్రస్తుతం రూ.52700కు చేరింది. హయత్‌నగర్‌ ఫ్లాట్ల విలువలు చదరపు అడుగుకు గతంలో రూ.2400 ఉండగా ప్రస్తుతం రూ3000గా ఉంది. శంషాబాద్‌లో రూ.3600 నుంచి రూ.4500కు చేరింది.