For Money

Business News

చివర్లో చిత్తుగా అమ్మేశారు

ఉదయం నష్టాల నుంచి కోలుకున్న నిఫ్టి మిడ్‌ సెషన్‌లో కాస్సేపు గ్రీన్‌లో ఉంది. యూరో మార్కెట్లు ప్రారంభమయ్యక అసలు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 18,350ని తాకిన నిఫ్టి మూడు గంటల ప్రాంతంలో 18,085కి క్షీణించింది. తరవాత స్వల్పంగా కోలుకుని 195 పాయింట్లు క్షీణించి 18,113 వద్ద ముగిసింది. ఒక్క బ్యాంకు షేర్లు మినహా మిగిలిన అన్ని కౌంటర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ప్రధాన ప్రైవేట్‌ బ్యాంకులు మాత్రం ఇవాళ గ్రీన్‌లో ముగిశాయి. ఇక మిడ్‌ క్యాప్‌ నిఫ్టి ఏకంగా రెండు శాతంపైగా నష్టపోయింది. నిఫ్టి నెక్ట్స్‌ కూడా 1.73 శాతం క్షీణించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిన్న భారీగా పెరిగిన మారుతీ ఇవాళ 4 శాతం నష్టంతో క్లోజైంది. సిమెంటు షేర్లు కూడా భారీగా క్షీణించింది. మిడ్‌ క్యాప్‌ నిఫ్టిలోని మొత్తం 50 షేర్లూ నష్టాల్లో క్లోజ్‌ కావడం విశేషం.