For Money

Business News

రిలయన్స్‌ డీల్‌ను ఛీ కొట్టిన ఇన్వెస్టర్లు

స్టాక్‌ మార్కెట్‌లో అదానీ, రిలయన్స్‌ గ్రూప్‌ షేర్ల మధ్య పెద్ద యుద్ధమే సాగుతోంది. కాని ఏ దశలో కూడా అదానీకి రిలయన్స్‌ కంపెనీలు పోటీ ఇవ్వలేకపోతున్నాయి. పాతికేళ్ళనాటి పాత పద్ధతులే తప్ప రిలయన్స్‌ ఇప్పటికీ మార్కెట్‌పై పట్టు సాధించలేకపోతోంది. అదానీకి చెందిన ప్రతి కంపెనీ ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపిస్తుంటే రిలయన్స్‌ ముంచేస్తోంది. రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన నెట్‌వర్క్‌ 18 అనే మీడియా సంస్థ ఉంది. ఈ కంపెనీకే టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ అనే అనుబంధ కంపెనీ ఉంది. ఈ రెండూ స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యాయి. జేమ్స్‌ మర్డోక్‌ రిలయన్స్‌ గ్రూప్‌ జత కడుతున్నట్లు గత కొన్ని నెలలుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలతో రెండు నెలల నుంచి ఈ రెండు కంపెనీల షేర్లు 50 శాతంపైగా పెరిగాయి. నిన్న ఆ డీల్ వివరాలు రానే వచ్చాయి. వయాకామ్‌ 18లో విదేశీ కంపెనీ వయాకామ్‌ వాటాను జేమ్స్‌ మర్డోక్‌కు ఇవ్వడం మినహా… డీల్‌లో కొత్త విషయం ఏమీ లేదు. చాలా వరకు ఈ డీల్‌ వివరాలు తెలియడంతో… ఉదయం ఆరంభంలోనే ఈ రెండు కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. రెండు షేర్లూ 12 శాతంపైగా పడినా… మద్దతు అందడం లేదు. రిలయన్స్‌ డీల్‌ ముందే తెలిసిన బ్రోకర్లు భారీగా పొజిషన్స్‌ తీసుకున్నారు. చెత్త డీల్‌ అని తెలియడంతో … అమ్మకాలు ప్రారంభించారు. ఏ స్థాయిలోనూ ఈ షేర్లకు మద్దతు లభించలేదు. ఒత్తిడి చూస్తుంటే ఈ ఏప్రిల్‌నెలలో వచ్చినా లాభాలన్నీ పోయినట్లే. చూస్తుంటే రెండు షేర్లూ 20 శాతం నష్టంతో ముగిసేలా ఉన్నాయి. లేదా దిగువ స్థాయిలో మద్దతు వస్తుందేమో చూడాలి.