For Money

Business News

17150పైన నిఫ్టి ప్రారంభం

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా భారీ లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 17189 పాయింట్ల స్థాయిని తాకిన నిఫ్టి.. వెంటనే క్షీణించింది. ఇపుడు 17121 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 82 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు అరశాతంపైగా లాభంతో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి నుంచి పెద్దగా మద్దతు అందలేదు.చాలా వరకు ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హిందుస్థాన్‌ షేర్‌ ఫలితాలకు స్పందిస్తోంది. 3 శాతం లాభంతో నిఫ్టిలో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. దివీస్‌ల్యాబ్‌, సన్‌ ఫార్మా షేర్లు ఇవాళ భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్రిటానియా నిఫ్టిలో టాప్‌ లూజర్‌గా నిలిచింది. జేమ్స్‌ మర్డోక్‌తో టీవీ18 చేసుకున్న ఒప్పందానికి మార్కెట్‌ నెగిటివ్‌గా స్పందించింది. టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌తో పాటు నెట్‌వర్క్‌ 18 షేర్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.