For Money

Business News

ప్రమోటర్లు లేరు… అంతా వాటాదారులదే

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం తరవాత బ్యాంక్‌కు ప్రమోటర్లు ఉండరని… వాటాదారులే ప్రమోటర్లు అని హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అన్నారు. రెండు సంస్థల విలీనం గురించి ఆయన మాట్లాడుతూ…విలీనం పూర్తిగా షేర్ల బదిలీతో జరిగిందని.. కాబట్టి బ్యాంక్‌కు ఇపుడు వాటాదారులే యజమానులని ఆయన అన్నారు. ఇది రెండు సమాన సంస్థల విలీనమని ఆయన చెప్పారు. విలీనం తరవాత హౌసింగ్‌ రుణాల వ్యాపారం భారీగా పెరుగుతుందని ఆయన అన్నారు. రెరా అమలుతరవాత రియల్‌ ఎస్టేట్‌ రంగం భారీగా వృద్ధి చెందుతోందని … హౌసింగ్‌ రంగానికి మౌలిక సదుపాయాల హోదా ఇవ్వడంతో పాటు అందుబాటు ధరలో ఇళ్ళు (Affordable Housing) పథకం కారణంగా హౌసింగ్‌ రుణాలు భారీగా పెరుగుతాయని దీపక్‌ పరేఖ్‌ అన్నారు.