For Money

Business News

MID REVIEW: ఆగని జోష్‌

ఉదయం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ విలీన వార్త తెచ్చిన జోష్‌ మార్కెట్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. బ్యాంక్‌ షేర్లన్నీ ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి బ్యాంక్‌ ఏకంగా 1217 పాయింట్ల లాభంతో 38365 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సూచీ నాలుగు శాతం లాభపడింది. నిఫ్టి మిడ్‌ సెషన్‌లో 1.83శాతం లాభంతో 17995 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభమైనా… లాభనష్టాలు నామ మాత్రంగానే ఉన్నాయి. నిఫ్టిలో ఒక్క ఇన్ఫోసిస్‌ మాత్రమే ఒక శాతం నష్టంతో ట్రేడవుతోంది. మిగిలిన షేర్లలో నామ మాత్రపు నష్టాలే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ షేర్లు నిఫ్టి టాప్‌ గెయినర్లలో టాప్‌లో కొనసాగుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ నామ మాత్రపు నష్టాల్లో ఉన్నాయి. మరి చివర్లలో నిఫ్టిలో లాభాల స్వీకరణ వస్తుందా అనేది చూడాలి.