For Money

Business News

హెచ్‌డీఎఫ్‌సీ విలీనం నిష్పత్తి ఇది…

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో తాను విలీనం అవుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ఇవాళ ప్రకటించింది. ఇది పూర్తిగా షేర్ల వాటాల మార్పిడితో జరిగే విలీనం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన 42 షేర్లకు హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన 25 షేర్లను కేటాయిస్తారు. ఈ విలీన నిష్పత్తితో డీల్‌ పూర్తవుతుంది. విలీనం తరవాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీకి 41 శాతం వాటా ఉంటుంది. ఈ విలీనానికి ఆర్బీఐతో పాటు ఇతర నియంత్రణ సంస్థల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ వద్ద రూ. 6.23 లక్షల కోట్ల ఆస్తులు ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వద్ద రూ. 19.38 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి.