For Money

Business News

17,900ని తాకిన నిఫ్టి

గత కొన్ని రోజులుగా బ్యాంకు నిఫ్టి లాంగ్‌ లేదా కాల్స్‌ ఉన్న ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిసింది. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలీనంతో నిఫ్టి 17900 స్థాయిని దాటగా, బ్యాంక్ నిఫ్టి 38000 స్థాయిని దాటింది. వెంటనే ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో నిఫ్టి ఇపుడు 17,804 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 134 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి కూడా 38000 స్థాయిని దాటిన బ్యాంక్‌ నిఫ్టి 37,732 వద్ద ట్రేడవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ – హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలీనం కారణంగా నిఫ్టి, నిఫ్టి బ్యాంక్‌ భారీ లాభాలు గడించాయి. ఇతర సూచీలు మాత్రం సాధారణ లాభాలకే పరిమితమయ్యాయి. కొటక్‌ బ్యాంక్‌లో మాత్రం ఒత్తిడి కొనసాగుతోంది. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టిలో ఈ షేర్‌ టాప్‌ లూజర్‌గా ఉంది. ఐటీ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఇన్ఫోసిస్‌ 1.7 శాతం నష్టంతో ట్రేడవుతోంది.