For Money

Business News

తెలంగాణలో మరో రూ. 1000 కోట్లు…HCCB

తెలంగాణలో రూ.1000 కోట్లతో ప్రాజెక్టును రాష్ట్రంలో నెలకొల్పేందుకు హిందుస్థాన్‌ కోకాకోలా బేవరేజెస్‌(హెచ్‌సీసీబీ) ముందుకొచ్చింది. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌ ఫుడ్‌ప్రాసెసింగ్‌ పార్క్‌లో రెండో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను నెలకొల్పుతోంది. తొలివిడతలో రూ.600 కోట్లను వచ్చే రెండేండ్లలో ఖర్చు చేయనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రెండో యూనిట్‌ ఏర్పాటుతోపాటు నీరు, ఘనవ్యర్థాల నిర్వహణలో సామర్థ్యం పెంపు, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాల నిర్మాణం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో హెచ్‌సీసీబీ నాలుగు ఎంవోయూలు కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వం 48.53 ఎకరాల భూమిని కేటాయించిందని కేటీఆర్‌ చెప్పారు. కొత్త ఫ్యాక్టరీతో నేరుగా 300 మందికి ఉపాధి లభించనున్నదని, ఇందులో 50 శాతం మంది మహిళా ఉద్యోగులే ఉంటారని తెలిపారు. అమీన్‌పూర్‌లో ఇప్పటికే హెచ్‌సీసీబీ బాట్లింగ్‌ ఫ్యాక్టరీ నిర్వహిస్తోంది.