For Money

Business News

డాక్టర్‌ రెడ్డీస్‌లో ‘హోల్డింగ్స్‌’ విలీనం

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ హోల్డింగ్స్‌ విలీనం కానుంది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌లో ఈ కంపెనీకి 24.83 శాతం వాటా ఉంది. విలీన స్కీమ్‌కు హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ విలీనానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ బోర్డు 2019 జులైలోనే ఆమోదం తెలిపింది. విలీనానంతరం డాక్టర్‌ రెడ్డీస్‌ హోల్డింగ్స్‌ వాటాదారులు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ వాటాదారులుగా మారతారు.